చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలి.

D Prashanth Netha
0

చెన్నూరు నియోజకవర్గం:- చేనేత రంగంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోస్టు కార్డు రాసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... చేనేత వృత్తి వ్యాపారం కాదని, దేశ వారసత్వ సంపద అని దానిపైన జిఎస్టి విధించడం ఏమాత్రం న్యాయం కాదని వెంటనే చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఉత్తరం రాసి నిరసన తెలపాలని తెలియజేశారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by