DIGITAL MANCHERIAL:- తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ టిపి అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంచిర్యాల జిల్లా వైయస్సార్ టిపి అధ్యక్షుడు దుర్గం నగేష్ నేత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీని బలోపేతం చేయడానికి జిల్లాలో వివిధ భాగాల వారిగా పదవులలో నియమించడం జరిగిందని, ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో పెద్దపల్లి కోఆర్డినేటర్ చిలక సంతోష్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కల్పన, బెల్లంపల్లి కోఆర్డినేటర్ సతీష్ తదితర నాయకులు ఉన్నారు.



