ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు.

D Prashanth Netha
0
మంచిర్యాల జిల్లా:- జిల్లా కేంద్రంలోని రాముని చెరువు కట్టపై శనివారం ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొమురం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జల్, జంగల్, జమీన్ కోసం నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా పాటుపడాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, సింగరేణి విశ్రాంత కార్మికులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by