రోడ్డు ప్రమాదంలో బీజేపీ నేత మృతి.

D Prashanth Netha
0

మంచిర్యాల జిల్లా:- మందమర్రి మండలం లోని తిమ్మాపూర్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో బీజేపీ యువనేత మృతి చెందారు. మంచిర్యాల పట్టణ బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు రాచకొండ సత్యనారాయణ స్నేహితులతో కలిసి బొక్కలగుట్ట ప్రాంతానికి వెళ్లారు. అక్కడ పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా రాత్రి 11 గంటల ప్రాంతంలో క్వారీ రోడ్ నుండి బొక్కలగుట్ట వెళ్లే దారి మధ్యలో తిమ్మాపూర్ రోడ్డు వద్ద కారు పల్టీ కొట్టి పొదల్లోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by