మంచిర్యాల జిల్లా:- శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ఆటోను నడుపుతూ డివైడర్ ను ఢీ కొట్టడంతో బోల్తా పడింది. దీంతో వెనకాల వస్తున్న కారు ఢీ కొనడంతో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

.jpeg)