మంచిర్యాల జిల్లా:- నస్పూర్ మండలంలోని రెవెన్యూ ప్రాంతంలోనీ 36 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించుకొని ఉన్నటువంటి నిర్మాణాన్ని నస్పూర్ తాసిల్దార్ జ్యోతి ఆధ్వర్యంలో జెసిబి ద్వారా అక్రమ కట్టడాన్ని కుల ద్రోయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ....ప్రభుత్వ భూమీలో అక్రమంగా కట్టడాలు చేపడితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్, ఇతరులు పాల్గొన్నారు.



