మంచిర్యాల జిల్లా:- నెన్నెల మండలం కోనంపేట గ్రామ శివారు లో 30సంవత్సరాలు గా ప్రభుత్వ భూమిని కొందరు రైతులు సాగు చేసుకుంటున్నారు. అయితే అప్పుడున్న ఫారెస్ట్ అధికారుల ఒత్తిళ్ళ వల్ల రైతుల అప్పుడు నిలిపివేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పొడు రైతులకు హక్కు పత్రాలపై సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొనంపేటకు చెందిన గ్రామస్థుల పేర్లు కొంత మందివి వచ్చి, మరి కొంత మంది పేర్లు వచ్చే మరికొంతమంది పేరు రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. లిస్టులో పేరు లేని వాళ్లను వెంటనే లిస్టులో చేర్చాలని బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ కి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు రాజ్ కుమార్, సామాజిక కార్యకర్త శ్రీనివాస్, రైతులు పాపయ్య, జేయరం, మల్లేష్, పెంటక్క, లక్ష్మీ, సునీత తదితరులు పాల్గొన్నారు.


