బెల్లంపల్లి నియోజకవర్గం:- తాండూర్ మండల కేంద్రంలో శనివారం ఉదయం మహిళా విభాగం అధ్యక్షురాలు పార్వీన్ సుల్తానా ఆధ్వర్యంలో 20 మంది మహిళలు YSRTP పార్టీలో చేరినారు. వీరిని మంచిర్యాల జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కల్పన జాగటి కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పార్టీ అధ్యక్షురాలు ఒక మహిళా కావడం మాకు చాలా గర్వాంగా ఉందని, షర్మిలమ్మ పాదయాత్రను చుస్తూ మహిళలు చాలా మంది పార్టీలో చేరుతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సుంకరి రాజేశ్వరి, బెల్లంపల్లి నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు స్వరూప, బెల్లంపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి MD. సర్వర్, తాండూర్ మండల మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి భువనగిరి లక్ష్మి,సాబీబ్ బేగం,మల్లమ్మ,పార్వతి, సాదియా బేగం పాల్గొన్నారు.



