DIGITAL MANCHERIAL:- మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా శనివారం ఉదయం వట్టిపల్లి, కొండూరు మరియు రాజునాయక్ తండ గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పెద్దపెల్లి ఎంపీ బోర్కుంట వెంకటేష్ నేత. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మునుగోడు లో జరగబోవు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసే ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తో పాటు ఇతర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.



