మంచిర్యాల జిల్లా:- తెలంగాణ రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సులు ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసిఎ కోర్సులలో పెంచిన వృత్తి విద్యా కోర్సులు ఫీజులు వెంటనే తగ్గించాలి అని మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ఫీజులు పెంచుతూ ఇచ్చిన జీ.వో.ను వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.

