మంచిర్యాల జిల్లా:- బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో గల రైతు వేదిక పక్క ఖాళీ స్థలంలో 20 రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని మొక్కజొన్న పంట వేసుకోగా విషయం తెలుసుకున్న... అధికారులు బెల్లంపల్లి ఆర్టీవో శ్యామలాదేవి, తహసిల్దార్ కుమారస్వామి ఏలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా భూమిని దున్ని సాగు చేస్తున్న పంటను బ్లేడు ట్రాక్టర్ తో ధ్వంసం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ... అనుమతులు లేకుండా ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

