మంచిర్యాల జిల్లా:-బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూర్ మండలంలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను కలిసి వినతి పత్రం అందజేసిన మండల యువకులు. యువకులు ఇచ్చిన వినతి పత్రం మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.... మాదారం పోలీస్ స్టేషన్ సమీపంలో క్రీడా మైదానానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు యువకులు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రవీణ్, నవీన్, అనీల్, శ్రవణ్ కుమార్ యువకులు పాల్గొన్నారు.

