DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి మండలంలోని ఆకెనపల్లి గ్రామంలో ప్రభుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... దళారుల దగ్గర మోసపోకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే వరి ధాన్యం అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీపీ శ్రీనివాస్, ఎంపీటీసీ సుభాష్ రావు, సర్పంచ్ ఉమ దేవి, సహకార సంఘం డైరెక్టర్ అశోక్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గణేష్ గౌడ్, మండల ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.



