DIGITAL MANCHERIAL NEWS:- నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై కిరాయి గూండాల దౌర్జన్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం కాసిపేట మండలంలోని బిజెపి నాయకుల ఆధ్వర్యంలో దేవపూర్ మెయిన్ రోడ్డుపై రాస్తారోక నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ... ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేసి, ఫర్నీచర్ ధ్వంసం చేయడం సిగ్గుచేటన్నారు. అలాగే వారి తల్లి మహిళ అని చూడకుండా ఆమెపై దాడి చేసి బూతులు తిట్టడం దారుణం అన్నారు. ఎమ్మెల్సీ కవిత ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఎంపీ నీ చెప్పుతో కొడ్తనని అనడం సిగ్గుచేటన్నారు. వెంటనే ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వచ్చి పలువురి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఇంచార్జ్ అక్కట పురం రమేష్, మండల ప్రధాన కార్యదర్శి సురo సంపత్ కుమార్, మండల ఉపాధ్యక్షులు బాకీ నరేష్ ఇతర నాయకులు పాల్గొన్నారు.



