మంచిర్యాల జిల్లా:- బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ(COE) పాఠశాలకి చెందిన నలుగురు విద్యార్ధులు పలు సెంట్రల్ యూనివర్సిటీల్లో సీట్లు సాధించి తమ సత్తా చాటుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకోసం జాతీయ స్థాయిలో జరిగిన కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సియుఈటి) లో ప్రతిభ చూపి అత్యంత ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశాలకు అర్హత సాధించడం పట్ల ప్రిన్సిపాల్ ఐనాల సైదులు ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా... ఆదిలాబాద్ రీజియన్ సంక్షేమ గురుకులాల ప్రాంతీయాధికారి (ఆరీఓ) కొప్పుల స్వరూపరాణి, ఏఆర్సీఓ కోటివ్హింతల మహేశ్వర రావు, ప్రిన్సిపాల్ ఐనాల సైదులు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో... HEC కోఆర్డినేటర్ అవునూరి రవి, వైస్ ప్రిన్సిపాల్ కోట రాజ్ కుమార్, అధ్యాపకులు నాగిని శ్రీరామ వర్మ, మిట్ట రమేష్ , చందా లక్ష్మీనారాయణ, గాజుల రాజేందర్, కట్ల రవీందర్, అర్జున్, రఫీ, ఆకినేపల్లి రాజేష్ , విజయ్ పాల్గొన్నారు.

