మంచిర్యాల జిల్లా:- బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల COE (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) లో గత విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న సూర్య వంశం శివప్రసాద్ బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాడు. మంగళవారం విడుదలైన SSC 2021 (స్టాఫ్ సెలక్షన్ కమిషన్-2021) ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా... పాఠశాల ప్రిన్సిపాల్ శివప్రసాద్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... శివ ప్రసాద్ మీద పెట్టుకున్నా వారి తల్లిదండ్రుల కలను నిజం చేశాడని తెలిపారు. పేదరికంలో పుట్టి పెరిగిన విద్యార్థి ఉద్యోగంలో సెలెక్ట్ కావడంతో ప్రిన్సిపాల్ తో పాటు కళాశాల ఉపాధ్యాయులందరూ హర్షం వ్యక్తం చేశారు.

