మంచిర్యాల జిల్లా:- చెన్నూరు నియోజకవర్గంలో వైయస్ షర్మిల పర్యటనలో భాగంగా పిలిచి డబ్బులు ఇవ్వలేదని మహిళలు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.... నియోజకవర్గంలో వైయస్సార్టీపీ అధ్యక్షురాలు చేపట్టిన పాదయాత్రలో భాగంగా మహిళలను 500 రూపాయలు, బిర్యాని పెట్టిస్తామని పిలిచి, కనీసం తాగడానికి కూడా మంచి నీళ్లు ఇవ్వలేదని మంగళవారం రాత్రి మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ... వైయస్సార్టీపీ నాయకులు దుర్గం నగేష్, రంజిత్ అనే వ్యక్తులు మా దగ్గరికి వచ్చి షర్మిల పాదయాత్రలో పాల్గొనాలని పాల్గొన్న వారికి అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి, కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వా లేదని తెలియజేశారు.

