మంచిర్యాల జిల్లా:- బెల్లంపల్లి నియోజకవర్గానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు 13,49,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందచేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... నిరుపేదలకు తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాణి-సురేష్, బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, సోమగూడెం సర్పంచ్ ప్రమీల గౌడ్, కాసిపేట వైస్ ఎంపీపీ విక్రమ్, తదితరులు పాల్గొన్నారు.

