కాంగ్రెస్ పార్టీ నాయకులు... కిరాయిదారుల మధ్య ఉద్రిక్తత...!
November 17, 2022
0
DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కిరాయి దారుల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంప్లెక్స్ లోని కిరాయిదారులకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు మధ్య షాపుల కిరాయి విషయంలో విభేదాలు ఏర్పడడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు 5 రోజుల కిందట షాపులకు తాళాలు వేసి షాపులు మూసివేశారు. దీనితో కిరాయిదారులు గురువారం తాళాలు పగలగొట్టి షాపులు తెరవడంతో మళ్లీ కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకొని షాపులు మోసే ప్రయత్నం చేయడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కిరాయి దారులకు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గొడవను సర్దు మనకే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుమల శంకర్, చాకపల్లి ఎంపీటీసీ మహేందర్ ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




