DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి ప్రైవేటీకరణపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్ అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని బిజెపి కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... బీజేపీ సింగరేణి ప్రైవేటీకరణ చేస్తోందని తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. సంస్థలో తెలంగాణ ప్రభుత్వ వాటా 51%, కేంద్ర ప్రభుత్వం వాటా 49 శాతం ఉందన్నారు. ఇలా ఉంటే కేంద్రం సింగరేణి ప్రైవేటీకరణ ఎలా చేయగలుగుతుందని ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే బాల్క సుమన్ బిజెపి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ముందుగా సింగరేణి కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక కార్మికులను పక్కదారి పట్టిస్తున్నారని అందుకే సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మీడియా సమావేశంలో ఆయనతో పాటు యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులు, పెద్దపెల్లి పురుషోత్తం, కోడి రమేష్, మల్లికార్జున్, మల్లేష్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

