మంచిర్యాల జిల్లా:- బెల్లంపల్లి నియోజకవర్గంలో వైయస్ షర్మిల పర్యటనలో భాగంగా ఆదివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద చేసిన ఆరోపణలను దళిత సంఘ నాయకులు ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సోమవారం ప్రెస్ క్లబ్ లో దళిత సంఘ నాయకులు మాట్లాడుతూ.... బెల్లంపల్లి ఎమ్మెల్యే మీద సంబంధం లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని, అలానే మీ తండ్రి చేసిన ద్రోహంతోనే తెలంగాణ ప్రాజెక్టులన్ని ఆంధ్రప్రదేశ్ తరలించారని, ఇంతకు నీకు తెలంగాణలో తిరగడానికి అర్హత ఉందా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలని వైయస్ షర్మిల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

