DIGITAL MANCHERIAL NEWS:- భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామగుండం పర్యటనను వ్యతిరేకిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేసిన AITUC నాయకులు. వివరాల్లోకి వెళితే... మోడీ రామగుండం పర్యటన వ్యతిరేకిస్తూ శుక్రవారం AITUC ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను స్థానిక కార్యాలయం నుంచి ఊరేగింపుగా నిర్వహించి గోలేటి మెయిన్ రోడ్డు వద్ద నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... మోడీకి వ్యతిరేకంగా మోడీ గో బ్యాక్ అంటూ భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.

