DIGITAL MANCHERIAL NEWS:- చెన్నూరు నియోజకవర్గం లోని యువత ఎస్సై, కానిస్టేబుల్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని వార్డ్ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ పట్టణంలోని ఠాగూర్ స్టేడియంలో బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్సై కానిస్టేబుల్ శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు నాలుగు షార్ట్ ఫుట్స్, కోన్స్ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా పెట్టుకొని చదివితే తప్పకుండా ఉద్యోగం సాధించవచ్చని తెలిపారు.

