అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మందమర్రి పట్టణంలోని విద్యానగర్ లో ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 70క్వింటాల పిడిఎస్ స్వాధీనం చేసుకున్న మందమర్రి మండల తహశీల్దార్ సంపతి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ....ఈ మేరకు పంచనామ నిర్వహించి, ప్రాపర్టీని సీజ్ చేసి, 6ఏ కింద కేసు నమోదు కేసు నమోదు చేయడం జరిగిందని, అలాగే నివేదికను జిల్లా కలెక్టర్ కు, మంచిర్యాల ఆర్డీవో కు, పై అధికారులకు అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by