మంచిర్యాల జిల్లా:- బెల్లంపల్లి పట్టణంలో ని ప్రిన్సిపాల్ కు తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం. వివరాల్లోకి వెళితే... బెల్లంపల్లి పట్టణం నుండి గురజాల వైపు వెళ్లే రహదారిలో జరిగిన ప్రమాదం. ఫుల్లుగా మద్యం సేవించి, వేగంతో వాహనం నడపడం ద్వారా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు. యొక్క ప్రమాదంలో ఎవరికి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఫుల్లుగా మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. మద్యం సేవించింది ఎవరో కాదు ఒక గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి అని తెలియడంతో... ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఇలా చేయడం ఏంటని విమర్శలు వెలువెత్తుతున్నాయి. స్థానిక పోలీసులు వచ్చి విచారణ చేపడుతున్నారు.


