కన్నాల భూమిపై కబ్జాదారుల కన్ను...!
November 18, 2022
0
DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి మండలం లోని కన్నాల గ్రామ శివారులో గల 60 సర్వే నెంబర్ పై భూ కబ్జాదారుల కన్ను. వివరాల్లోకి వెళితే... కన్నాల గ్రామ శివారులో గల 60వ సర్వే నెంబర్ లో గల 55 ఎకరాల భూమి గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. అయితే 2015 సంవత్సరంలో అప్పటి ఇప్పటి RDO, ఎమ్మార్వో కలసి భూమి కబ్జా కాకుండా గవర్నమెంట్ డబ్బులు 3 లక్షల రూపాయలుతో కంచె వేయించారు. అయితే మరల ఇప్పుడు కొంతమంది కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలసి ఇట్టి భూమిలో 10 కోట్లకు విలువ చేసే సుమారు 8 ఎకరాల భూమిని రాత్రికి రాత్రి చదును చేసి బోర్వెల్ కూడా వేసినప్పటికీ ఆర్డిఓ, ఎమ్మార్వో గాని పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. వెంటనే దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే చట్టరీత్య చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి.



