DIGITAL MANCHERIAL NEWS:- ట్రస్మా ఆధ్వర్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల బందుకు పిలుపునిచ్చారు. బందుకు గల కారణాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయునిపై దాడిని నిరసిస్తూ శనివారం ట్రస్మా ఆధ్వర్యంలో జిల్లాలలోని అన్ని పాఠశాలల బందుకు జిల్లా అధ్యక్షుడు రాపోలు విష్ణువర్ధన్ రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఉన్నత స్థానంలో గౌరవాన్ని పొందాల్సిన ఉపాధ్యాయున్ని కొట్టడం పనికిమాలిన చర్య అని, సమాజానికి రక్షణగా నిలవాల్సిన పోలీస్ (తండ్రి), విద్య బుద్ధులు నేర్పే గురువు మీద చేయి చేసుకోవడం తలదించుకోవలసిన విషయం అన్నారు.

.jpeg)