DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణం 12వ వార్డులో 50 లక్షల రూపాయల TUFIDC నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణపనులను ముఖ్యఅతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కెసిఆర్ రాష్ట్ర పాలనలోనే బెల్లంపల్లి అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, స్థానిక కౌన్సిలర్ శ్రీలత-రమేష్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, B(T)RS నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


