DIGITAL MANCHERIAL NEWS:- వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం లోని నెన్నెల మండలంలోని గుండ్లసోమారం గ్రామంలో సోమవారం ప్రభుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి-ప్రతాప్ రెడ్డి, జడ్పీటీసీ శ్యామల-రాం చందర్, మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, B(T)RS పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


