DIGITAL MANCHERIAL NEWS:- డిసెంబర్ నెలలో జరిగేP DSU రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు జెఎల్ శ్రీకాంత్ తెలుపునిచ్చాడు. అందులో భాగంగానే సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్క్స్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మహాసభలను విజయవంతం చేయాలని పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కెసిఆర్ ప్రభుత్వంకు విద్యను బలోపేతం చేయకుండా ఎన్నికల పైన ఉన్న శ్రద్ధ విద్యారంగంపై లేదని దీనివలన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుందని, అలాగే గత రెండు సంవత్సరాల కాలం నుండి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియాజ్మెంట్ వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని PDSU తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు రెడ్డి చరణ్, పట్టణ కార్యదర్శి రాహుల్, జిల్లా నాయకులు మనోహర్, సిద్ధార్థ, రాజ్ కుమార్, రమ్యకుమారి, దీపిక, కార్తీక్, తదితర నాయకులు పాల్గొన్నారు.

