వరుస దొంగతనాలతో రెచ్చిపోతున్న దొంగలు...!
November 07, 2022
0
మంచిర్యాల జిల్లా:- జిల్లా వ్యాప్తంగా వరుసగా దొంగతనాలు జరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.... బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో గల ముఖేష్ డ్రెస్సెస్ బట్టల షాపులో వెనుక రేకులు పగలగొట్టి దొంగలు లోపలికి చొరబడి వీరంగం సృష్టించారు. ఈ సందర్భంగా షాప్ యజమాని మాట్లాడుతూ.... షాప్ లో దాచుకున్న బంగారంతో పాటు నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా వచ్చి విచారణ చేపట్టారన్నారు.


