మంచిర్యాల జిల్లా:- జిల్లా కేంద్రంలో సింగరేణి అధికారులు నిర్లక్ష్యం కాంట్రాక్టు సింగరేణి కార్మికుడు పిట్ల గోపాల్ బలయ్యాడు. వివరాల్లోకి వెళితే.... మందమర్రి ఏరియా పరిధిలోని ఆర్కే- 1గని సమీపంలో 33 కెవి లైన్ మరమ్మతులు చేస్తున్న సమయంలో గోపాల్ స్తంభంపై ఉండగానే సింగరేణి ఎలక్ట్రిషియన్ కరెంట్ ఆన్ చేయడంతో కార్మికుడు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మరణించాడు. సింగరేణి ఎలక్ట్రిషన్ చేసిన పనికి కాంట్రాక్టు కార్మికుడు బలి కావడంతో తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. మృతి చెందిన కార్మికుడి మృతదేహాన్ని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

