DIGITAL MANCHERIAL NEWS:- కొన్ని రోజుల కిందట బెల్లంపల్లి పట్టణంలో చోరీకి గురైన సొమ్మును స్వాధీనం చేసుకున్న పోలీసులు. వివరాల్లోకి వెళితే... బెల్లంపల్లి పట్టణంలోని ముఖేష్ డ్రెస్సెస్ దుకాణంలో దొంగలు పడి దోచుకున్న సొమ్మును మంగళవారం బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులు రికవరీ చేసుకున్నారు. ఈ సందర్భంగా స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల డిసిపి అఖిల్ మహాజన్ మాట్లాడుతూ... ఇప్పటికే నిందితులపై 6 కేసులు ఉన్నట్లు తెలిపి దొంగతనం చేసిన, 250 గ్రాముల బంగారం, 265 గ్రాముల సిల్వర్, 11 వేల నగదును స్వాధీనం చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నామని, నిందితులు బెల్లంపల్లికి చెందిన ఎం. డీ. బరాద్ధీన్, ఎం. డీ. అఫ్సియా శరీన్, సయ్యద్ సికిందర్ అలీ అని తెలిపారు.


