DIGITAL MANCHERIAL NEWS:- నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.కోటిన్నర వసూలు చేసి పరారైన ఉపాధ్యాయుడు. వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లాలోని జన్నారం, దండేపల్లి మండలాలకు చెందిన పలువురు నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ఉపాధ్యాయుడు వారి నుండి రూ. లక్ష నుండి రూ. 10 లక్షల వరకు వసూలు చేశాడు. నిరుద్యోగుల నుండి పైసలు వసూలు చేసిన తర్వాత ఉపాధ్యాయుడు ఒకేసారి మెడికల్ లీవ్ తీసుకొని పరారు కావడంతో డబ్బులు ఇచ్చినా నిరుద్యోగులు అందరూ ఆందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇలాంటి మాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని సూచించారు.

.jpeg)