వాట్సాప్ స్టేటస్ కు స్పందించిన అధికారులు...!

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- భీమిని మండలంలోని వెంకటపూర్ గ్రామంలో ప్రైమరీ పాఠశాలకు మంచినీటి కనెక్షన్ ఇవ్వాలని ఇప్పటికే ఎన్నిసార్లు కోరినా స్పందించలేదు. ఈ యొక్క సమస్యపై అదే గ్రామానికి చెందిన సోమిశెట్టి రాజేష్ అనే యువకుడు సోషల్ మీడియా ద్వారా పై అధికారులకు తెలియజేయడంతో వెంటనే స్పందించిన నీటిపారుదల అధికారులు స్పందించి, శనివారం నీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపట్టారు. సమస్యను ఇలా తెలుపగానే పరిష్కరించినందుకుగాను నీటిపారుదల అధికారులకు పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో నీటిపారుదల అధికారులు ఏఈఈ పోశం మరియు పాఠశాల ఉపాధ్యాయులు, యువకులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by