DIGITAL MANCHERIAL NEWS:- కన్నెపల్లి మండల కేంద్రంలో కుక్కలు వీరవిహంగం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పశువులపై దాడి చేసిన కుక్కలు ఓకే సారీ మనుషులపై దాడికి దిగడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన వ్యక్తం అవుతుంది. ఏకంగా ఆదివారం ఐదుగురి వ్యక్తులపై దాడి చేయగా... అందులో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వారిని బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల నుండి కాపాడాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


