మంచిర్యాల జిల్లా:- జిల్లావ్యాప్తంగా వరుస దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. వివరాల్లోకి వెళితే.... చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం కాలనీలోని చర్చి సమీపంలో సెరికల్చర్ ఉద్యోగి బావొద్దిన్ ఇంట్లో దొంగతనం జరిగినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇంటికి తాళం వేసి భార్యాభర్తలు విధులకు వెళ్లి తిరిగి వచ్చే సమయానికి పగలగొట్టి ఉండగా, లోపలికి వెళ్లి చూడగా వాన పగలగొట్టి 3 తులాల బంగారం, రూ.40వేల నగదు చోరీకి గురైనట్లు తెలియజేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.

