గ్రామ సమస్యలను పట్టించుకునేది ఎవరు...!

D Prashanth Netha
0

మంచిర్యాల జిల్లా:- వేమనపల్లి మండలంలోని దస్నాపూర్ గ్రామపంచాయతీలో గల కొత్తపల్లి గ్రామంలోని సమస్యలను పట్టించుకోని సర్పంచ్, అధికారులు. గ్రామంలోని ఎస్టీ కాలనీ చేతిపంపు వద్ద నీరు నిలువ ఉండి బురదమయంగా మారుతుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నీరు నిల్వ లేకుండా చేసి, మురికి కాలువను శుభ్రం చేయించాలని పలుమార్లు గ్రామ సర్పంచ్, కార్యదర్శి, ఎంపీడీవోలకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ  పట్టించుకోవడంలేదని, అలాగే ఇప్పటికీ పలుమార్లు న్యూస్ పేపర్లో వచ్చినప్పటికీ అధికారులు ఎవరూ స్పందించలేదన్నారు. ఇప్పుడైనా జిల్లా అధికారులు తమ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by