రేషన్ బియ్యాన్ని పట్టుకున్న అదనపు కలెక్టర్.
November 09, 2022
0
మంచిర్యాల జిల్లా:- జైపూర్ మండల పరిసర ప్రాంతంలో నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్. ఈ సందర్భంగా అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న ఆటోని సీల్ చేసి, అధికారులకు అప్పగించారు. అనంతరం... అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.... నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

