DIGITAL MANCHERIAL NEWS:- ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం. వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మండల కేంద్రంలోని స్థానిక మసీదు కాలనీలోని ఒక ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి, ఒకేసారిగా మంటలు చెలరేగడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదమునకు సంబంధించి పూర్తి, నష్ట వివరాలు తెలియాల్సి ఉంది.

