DIGITAL MANCHERIAL NEWS:- చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్. చెన్నూర్ నియోజకవర్గంలోని చెక్ డ్యామ్స్ తో పాటు చెన్నూరు పట్టణంలో రూ. 6 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్న పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్, రూ. 3 కోట్లతో కుమ్మరి కుంట చెరువు మినీ ట్యాంక్ పనులపై సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... త్వర త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సిఈ శ్రీనివాసరెడ్డి గారు, ఎస్ఈ విష్ణు,, డిఈ వేణుగోపాల్ పాల్గొన్నారు.


