జీతాలు ఇవ్వడం లేదని... టవర్ ఎక్కిన ఉపాధ్యాయుడు.
November 19, 2022
0
DIGITAL MANGHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలంలో జీతాలు సరిగా ఇవ్వడం లేదని సెల్ఫోన్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన పిటి శ్రీనివాస్. వివరాలు ఇలా ఉన్నాయి... దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న DAV (ఓల్డ్ కార్మెల్ గిరి) పాఠశాలలో గత కొద్ది నెలలుగా పాఠశాల ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వడం లేదని, వేతనాలు చెల్లించాలని అడిగినప్పటికీ కంపెనీ యజమాన్యం ఏమాత్రం స్పందించకపోవడంతో శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు సెల్ఫోన్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఉపాధ్యాయుడికి కిందికి దింపే ప్రయత్నం చేశారు.


