క్లీనర్ల పై నుంచి వెళ్లిన లారీ...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ యాష్ లోడింగ్ కు వచ్చిన లారీ కింద పడుకున్న ఇద్దరు క్లీనర్ల పై నుంచి లారీ వెళ్లడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. దేవాపూర్ సిమెంట్ కంపెనీకి యాష్ తరలించేందుకు ఎస్టీపీపీకి అర్ధరాత్రి వచ్చిన క్లీనర్లు తిరుపతి, సల్మాన్ లారీ కింద పడుకున్నారు. డ్రైవర్ చూసుకోకుండా వారిపై ఎక్కించాడు. గాయాలైన ఇద్దరిని చికిత్స కోసం మంచిర్యాలకు ఆస్పత్రికి తరలించారు. తిరుపతికి ఎడమ కాలుకు తీవ్ర గాయం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by