జన్నారం మండల కేంద్రంలో దొంగల హల్చల్...!
November 21, 2022
0
DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలంలో దొంగలు హల్ చల్. వివరాలు ఇలా ఉన్నాయి. జన్నారం మండలం కేంద్రంలోని మూడు దుకాణాలలో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనాలకు పాల్పడ్డారు. లహరి ఎంటర్ప్రైజెస్ లో 6000 రూపాయలు, చోరీకి గురి అయ్యాయని ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సమాచారం అందుకున్న జన్నారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, సీసీ పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.


