DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధుతోనే దళిత అభివృద్ధి చెందుతుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. వివరాల్లోకి వెళితే... బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండలంలోని సూర్జాపూర్ గ్రామానికి చెందిన రాజయ్యకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన ఫర్టిలైజర్ షాపుని సోమవారం ఉదయం పరిశీలించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులతో పాటు అన్ని వర్గాల వారిని ఆదుకుంటుందని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు జడ్పీటీసీ సత్యనారాయణ, B(T)RS పార్టీ మండల అధ్యక్షుడు నిరంజన్, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు మహేష్ గౌడ్, మండల ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.


