భార్యను హత్య చేసి... ఆత్మహత్య చేసుకున్న భర్త...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- భార్యను హత్య చేసి, భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.... మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ పట్టణంలోని స్థానిక పోచమ్మ బస్తీకి చెందిన మాటూరి లక్ష్మణ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు అన్న విషయం తెలుసుకున్న తన బంధువులు వారి ఇంటికి చేరుకోగా, ఇంట్లో నాగలక్ష్మి అప్పటికే మృతి చెంది ఉంది. కుటుంబ కలహాల వల్ల ముందుగా భార్యను హత్య చేసి, తరువాత భయంతో భర్త కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటాడని బంధువులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా నాగమణి తండ్రి గంగారపు కొమురయ్య మాట్లాడుతూ.... నా కూతురు చావుకు నా అల్లుడు వారి కుటుంబ సభ్యుల కారణమని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామన్నారు.












.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by