DIGITAL MANCHERIAL NEWS:- కాసిపేట మండలంలోని మద్దిమడ గ్రామంలో శుక్రవారం రోజున గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఆధ్వర్యంలో ఆధార్ కార్డు సంబంధిత స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పది సంవత్సరాల నుండి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకొని వారు వెంటనే అప్డేట్ చేసుకోవాలని, ఆధార్ కార్డు కూడా నేటి సమాజం లో నిత్యవసరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆధార్ అధికారులు జనార్ధన్, సర్పంచ్ జంగు, వెంకటేష్, ఇతరులు పాల్గొన్నారు.

