ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండల కేంద్రంలో గల తెలంగాణ మోడల్ స్కూల్ అనుబంధ బాలికల హాస్టల్ లో పొరుగు సేవల పద్ధతిన ఖాళీల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కేర్ టేకర్ (1), వాచ్ ఉమెన్ (1), హెడ్ కుక్ (1), అసిస్టెంట్ కుక్ (2), ఏఎన్ఎం (1) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 14 నుండి 17 వరకు కాసిపేట మండలంలోని ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. 








Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by