DIGITAL MANCHERIAL NEWS:- చెన్నూరు నియోజకవర్గం లోని మందమర్రి పట్టణంలో ప్రపంచ మధుమేహ దినోత్సవం పురస్కరించుకొని బస్టాండ్ ఏరియాలో మందమర్రి లయన్స్ క్లబ్ మరియు మదర్ థెరిస్సా క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం షుగర్ టెస్ట్ లు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నవంబర్ నెల మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా టెస్టులు చేయడం జరుగుతుందని, అలాగే ఈరోజు దాదాపుగా 250 మందికి టెస్టులు చేయగా 30 మంది వరకు షుగర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.




