DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలం ప్లాస్టిక్ కవర్లలో మహిళా (50) మృతదేహం లభ్యం. వివరాల్లోకి వెళితే... మందమర్రి పట్టణంలోని స్థానిక రైల్వే ట్రాక్ పక్కన వినాయక విగ్రహాలు తయారు చేసే షెడ్డు సమీపంలో ప్లాస్టిక్ కవర్ లో మహిళా మృతదేహం చుట్టి ఉండడంతో, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మహిళ యొక్క పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


